![]() |
![]() |
.webp)
ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద ఖాళీ లేకుండా పనిచేసే యాంకర్. డాన్సర్, యాంకర్ మాత్రమే కాదు నటుడు కూడా. ప్రస్తుతం టు మూవీస్ లో నటిస్తున్నాడు ప్రదీప్. బుల్లితెర మీద ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. ఏ షో చేసిన, ఇంటర్వ్యూ చేసిన పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. 2018లో ప్రదీప్ స్వయంవరం థీమ్ తో ఓ షో కూడా చేసాడు.
ఆ షోతో ప్రదీప్ పెళ్లి అయిపోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐతే ఇప్పుడు మరోసారి ప్రదీప్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు దీని మీద ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు. “ నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే దీనిపై ఇంతవరకు స్పందించలేకపోయాను. నా పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదు. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. ప్రొఫెషన్ పరంగా మా టీమ్ వాళ్లు ఆమెతో మాట్లాడి ఉండచ్చు. కొన్ని పోస్టుల్లో ట్యాగ్ చేసి ఉండొచ్చు. ఇలాంటి వార్తల్లో ఆమె పేరు రావడం చాలా బాధగా ఉంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.
నాన్న చనిపోయిన బాధ నుంచి మా ఫామిలీ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. నా పెళ్లికి ఇంకాస్త సమయం ఉంది. నేను ప్రస్తుతం నా రెండో సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. 2023లో నేను హీరోగా నేను నటిస్తున్న సెకండ్ మూవీ రాబోతోంది. దాని కోసమే రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాను” అంటూ ప్రదీప్ మాచిరాజు క్లారిటీ ఇచ్చాడు.
![]() |
![]() |